'దోపిడి శక్తులను పోరాటాలతో అడ్డుకుందాం'
గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులైన అదాని, అంబానీలకు మోదీ దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కమ్యూనిజం, నక్సలిజంపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు.