పోషణ-ఎదుగుదలపై దృష్టి సారించండి: కలెక్టర్
అన్నమయ్య: పిల్లల పోషణ, ఎదుగుదల, ఆరోగ్య ఫలితాల మెరుగుదలలో ICDS శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారంకలెక్టరేట్‌లో సీడీపీవోలు, సూపర్వైజర్లతో బాలసంజీవిని THR పంపిణీ, గ్రోత్ రిపోర్ట్, పోషణ ట్రాకర్, PES హాజరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. కిట్ల పంపిణీతో పాటు హిమోగ్లోబిన్, ఎత్తు, బరువు పెరుగుదలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.