కొమురవెల్లిలో మంత్రి పొన్నం పూజలు
SDPT: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం, పట్నం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. మల్లన్న అంటే ఒక విశ్వాసం ఉగాది వరకు జరుపుకునే కొమురవెల్లి మల్లన్న ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.