ఛైర్మన్‌ను కలిసిన జనసేన నాయకులు
ATP: జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె)ను గురువారం గుంతకల్లు జనసేన ముస్లిం మైనారిటీ నాయకులు ఫిరోజ్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. కేకే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.