VIDEO: ప్రధాని 'మన్ కీ బాత్'లో కరీంనగర్ పేరు
KNR: 128వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్‌కు చెందిన హస్తకళలను కొనియాడారు. కరీంనగర్‌లో తయారైన సాంప్రదాయ కళాకృతులను తాను విదేశీ ప్రధాన మంత్రులకు బహుకరించానని వెల్లడించారు. సిల్వర్‌తో చేసిన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి, పూల ఆకృతిలో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను ఇటలీ ప్రధానికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.