ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా AISF, AIYF ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. AISF జిల్లా కార్యదర్శి జోసెఫ్, AIYF జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ త్రయం అమరత్వం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AISF, AIYF నేతలు పాల్గొన్నారు.