మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా..?

HYD: నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు కమ్ముకున్నాయి. నగరంలో హై అలర్ట్ కొనసాగుతుండగా అందాల పోటీలో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు, ఇటు సామాన్య ప్రజలకు భద్రత కల్పించడం సవాలుగా మారింది. 3 వారాల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో అప్పటివరకు అన్నీ సజావుగా కొనసాగేలా చూడటం అత్యంత ఆవశ్యకంగా మారింది.