బాధితులకు పోస్టల్ సూపరింటెండెంట్ హామీ
SKLM: ఆరు నెలల క్రితం 33 మంది ఇచ్ఛాపురం తపాలా పొదుపు ఖాతాల్లో దాచుకున్న డబ్బులు మాయమయ్యాయి. ఈరోజుకి తమ సొమ్ము అందకపోవడంతో బాధితులు రెండు రోజులుగా ధర్నా చేసి కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు బాధితులతో మాట్లాడారు. వారికి జనవరి 15లోగా కేసు విచారణ పూర్తి చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.