ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

రంగారెడ్డి: నందిగామ మండలం అప్పరెడ్డి గూడా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. అనంతరం ఇళ్ల లబ్దిదారులతో మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం నాయకులతో కలిసి అరుణ అనే మహిళ ఇంట్లో రేషన్ షాప్ సన్న బియ్యంతో భోజనం చేశారు.