VIDEO: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థులు
ASF: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి వాంకిడిలో పలు వార్డ్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బెండరా గ్రామంలో ఓటర్లకు మద్యం బాటిళ్లు, డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద రూ. 7 వేలు స్వాధీనం చేసుకున్నారు.