సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..!

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..!

PLD: జనగణన పేరుతో సైబర్ మోసగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృత్తిక శుక్ల సూచించారు. జనగణన సిబ్బందిమంటూ ఇళ్లకు వచ్చి ఫోన్లకు వచ్చే ఓటీపీలు అడిగితే చెప్పవద్దని హెచ్చరించారు. జనాభాను లెక్కించే సిబ్బంది ఫోన్ నెంబర్ తప్ప ఓటీపీ అడగరని వేలిముద్రలు తీసుకోరని తెలిపారు. సిబ్బంది గుర్తింపు కార్డులోని క్యూఆర్ కోడ్ పరిశీలించాలన్నారు.