సీడ్ బాల్స్ తయారు చేసిన విద్యార్థులు

సీడ్ బాల్స్ తయారు చేసిన విద్యార్థులు

SRCL: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు (సీడ్ బాల్స్ )విత్తన బంతులు తయారు చేశారు. 70 మంది విద్యార్థులు 1000కి పైగా విత్తిన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం లోకని కిషన్ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ అడవులను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.