శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం

శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం

SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో మంగళవారం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్ బైర మానస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం గ్రామ వీధుల గుండా భక్తి శ్రద్ధలతో కొనసాగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.