పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కూలీల ధర్నా

PDPL: పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం కూలీలు ధర్నాకు దిగారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు లేక జీవనం దుర్భరమవుతోందని, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తక్షణమే జీతాలు చెల్లించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.