పెనుమురులో మహాభారత మహోత్సవం ప్రారంభం
CTR: పెనుమూరు మండలం కేంద్రంలోని ఆలయంలో మహాభారత మహోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త పెద్దినేని రుద్రయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గౌరీ శంకర్ కుటుంబ సభ్యులు స్వీకార కొడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.