ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములు అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోతున్నా.. లక్ష్యాన్ని వదిలి పెట్టకుండా పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.