ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు

ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు

టెహ్రాన్‌లోని బాలిస్టిక్ క్షిపణులు, ఆయుధాల తయారీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ, నిల్వ కేంద్రాలపై దాడులు చేసినట్లు తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, యూఏఈపై ఇరాన్ దాడులు కొనసాగించింది. అలాగే, తమ దేశంలో నిర్మాణ దశలో ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్ట్‌పై దాడి జరిగిందని కువైట్ ప్రకటించింది.