అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం
HYD: డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆలోచన విధానమే తమ ప్రభుత్వ విధానమని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే పాలన సాగుతోందని CM స్పష్టం చేశారు.