బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి
NTR: విజయవాడ భవానిపురంలో కూల్చివేసిన 42 ఇళ్లను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించి బాధితులను పరామర్శించారు. సాంకేతిక ఇబ్బందులను అడ్డం పెట్టుకొని 42 ఇళ్లను దుర్మార్గంగా కూల్చివేసి 42 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన ఆరోపించారు. నవంబర్ 4న సుప్రీంకోర్టు డిసెంబర్ 31 వరకు ఈ ప్రాంగణం జోలికి రావద్దని తీర్పునిచ్చినప్పటికీ, దీని వెనుక పెత్తందారుల హస్తం ఉందని ఆయన విమర్శించారు.