నిలిచిపోయిన మోనో రైల్ సేవలు

ముంబైలో మోనో రైల్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. భక్తి పార్క్, మైసూర్ కాలనీ మధ్య మార్గంలో ఈ ఘటన జరిగింది. రైలులో చిక్కుకున్న ప్రయాణికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్నార్కెల్ వాహనాలతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనితో వాడాలా, చెంబూర్ మధ్య మోనో రైల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.