'విద్యార్థులు ఉద్యోగ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు'

JGL: ర్యాగింగ్ పేరుతో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలస వ్యవసాయ కళాశాలలో ర్యాగింగ్ నిరోధక దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి సీఐ హాజరై మాట్లాడుతూ.. తోటి విద్యార్థులతో గౌరవంగా మెలగాలన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి విద్యార్థుల వివరించారు.