'రైతులు వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ ని వినియోగించుకోవాలి'
శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ లోని భాగ్యలక్ష్మి సంఘం వారికి సబ్సిడీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అందించిన FMB కిసాన్ డ్రోన్ యూనిట్‌ను మంగళవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పంపిణీ చేశారు. డ్రోన్ వినియోగం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకత సాధించవచ్చని, ప్రభుత్వం రైతుల కోసం అనేక ఆధునిక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.