నూతన యూనియన్ కమిటీ ఎన్నిక

VZM: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక కార్మికల యూనియన్ (సీఐటీయూ) జిల్లా నూతన కమిటీని ఆదివారం ప్రకటించారు. విజయనగరంలోని ఎన్.పి.అర్ భవన్‌లో 6వ మహాసభలో 30 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా మంగ లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా బి.సుధారాణి, కోశాధికారిగా స్వప్నను ఎన్నుకున్నాట్టు సభ్యులు తెలిపారు.