మూగ జీవాలు తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

MLG: ఏటూరునాగారం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా పశు రవాణా చేస్తున్న కంటైనర్‌ను బుధవారం ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో 40 పశువులను స్వాదీనం చేసుకుని గోశాలకు తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కంటైనర్ సీజ్ చేసినట్లు ఎస్సై తాజుద్దీన్ వెల్లడించారు. అక్రమంగా మూగ జీవాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.