VIDEO: 'నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ చేయించారు'
KMR: మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న తనను నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ చేయించారని, న్యాయం చేయాలని కోరుతూ గైక్వాడ్ రాజబాయి మంగళవారం తహశీల్దార్ ఎండీ ముజీబ్‌కు వినతిపత్రం అందజేశారు. 38 సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్నానని, ఉద్యోగ విరమణకు ఇంకా సమయం ఉన్నా ముందే ప్రకటించారని పేర్కొన్నారు.