VIDEO: రోడ్డెక్కిన రైతన్నలు
NRML: ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. భైంసా మండలంలోని దేగామ్ లో భైంసా - నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై ధర్నాకు దిగారు. పంటలకు నష్టం వాటిల్లి నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కూర్చున్నారు.