రేషన్ కార్ఢులు పంపిణీ చేసిన మంత్రి

JGL: గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం బుగ్గారం మండలంలోని పోచమ్మ ఫంక్షన్ హాల్‌లో అర్హులైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. దీంతో 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.