మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు

సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో ఎల్లమ్మ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో శుక్రవారం మంత్రి సవిత పాల్గొంటారని మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి పాల్గొంటారని చెప్పారు. అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సా. 4 గంటల వరకు పెనుకొండ టీడీపీ కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారన్నారు.