SRSP స్పిల్వే గేట్లు ఎత్తి నీరు విడుదల

NRML: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద కారణంగా స్పిల్వే గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని విడుస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున 4 నుండి 5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడిచే అవకాశం ఉంది. గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్.ఈ జగదీష్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.