ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధంపై సజ్జనార్ ట్వీట్

HYD: కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్‌పై నిషేధం విధించేలా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై TGRTC MD సజ్జనార్ X వేదికగా ట్వీట్ చేశారు. లెక్కలేనన్ని జీవితాలను నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేధించాలనే నిర్ణయం చాలా స్వాగతించదగినది. ఈ చర్య చాలా మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. #SayNoToBettingApps ఉద్యమం విజయవంతమైందన్నారు.