VIDEO: కంభంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం కంభం పట్టణంలోని స్థానిక తీర్థ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అనేది భక్తి, నియమం, దానం, సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన నెలగా ముస్లిం సోదరులు భావించి ఈ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.