గురుకుల పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

కోనసీమ: రాజోలులోని డా.బీ.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లలిత కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎస్సీ కేటగిరీలో 5, 6 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. ఈనెల 29వ తేదీ లోపు అర్హత కలిగిన వారు దరఖాస్తులను పాఠశాలలో అందించాలన్నారు.