ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పనులు ఏ దశలో ఉన్నాయని ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులతో మాట్లాడి బిల్లులు అకౌంట్లో జమ అయ్యాయా లేదా అని అడిగారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.