ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలి: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత పాటించాలని, ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు.