వైభవంగా ధ్వజస్తంభ అభిషేకం
WNP: బ్రహ్మణ వీధిలోని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ధ్వజ స్తంభానికి పంచగవ్య అభిషేకం, పుణ్యాహవాచనం, అంకురారోహణ తదితర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.