రానున్న రెండు రోజులు భానుడి భగభగలు
AP: రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.