పోలింగ్ అధికారులకు శిక్షణ
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మాస్టర్ ఆఫ్ ట్రైనర్ రవి యాదవ్ పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ బాక్స్ ఓపెన్, క్లోజ్ తదితర వాటిపై ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఎన్నికలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.