రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

VSP: విశాఖ మల్కాపురంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ఆదివారం మృతి చెందాడు. త్రినాధపురానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే బైకుపై శ్రీహరిపురం వెళ్తున్నారు. రామకృష్ణాపురం పెట్రోల్ బంకు వద్ద కింద జారిపడి ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా మరొక యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మల్కాపురం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.