'ఎరువులు అందుబాటులో ఉన్నాయి'

మన్యం: జిల్లాలో 12,944 టన్నుల యూరియా ఇప్పటివరకు సరఫరా అయ్యిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 12,944 టన్నులు సరఫరా అయ్యాయని కలెక్టర్ చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందనవసరం లేదన్నారు.