'హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు'
కోనసీమ: ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పి.గన్నవరం సీఐ భీమరాజు అన్నారు. అయినవిల్లి మండలం కోనసీమ విద్యాశ్రమ్ విద్యాసంస్థలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.