అమ్మవారి నగలు ఎత్తుకపోయిన దుండగులు
ప్రకాశం: కనిగిరి మండలం నందన మారెళ్ల గ్రామంలో కొండపై ఉన్న బాలార్క కోటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి నగలు దొంగిలించారు. ఆదివారం ఆలయ అర్చకులు తలుపు తీయగా విషయాన్ని గమనించి వెంటనే కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.