8933 మంది రైతులకు అన్నదాత సుఖీభవ

8933 మంది రైతులకు అన్నదాత సుఖీభవ

ASR: అన్నదాత సుఖీభవ పథకం 2వ విడతలో అరకులోయ మండలంలో 8933 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఏఓ ఫణిరాజ్ వర్మ తెలిపారు. 8582 మంది రైతులకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద రూ. 7,000 లు, 351 మందికి అన్నదాత సుఖీభవ పథకంలో రూ. 5000 లు లబ్ధి వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద మండలానికి రూ. 6,18,29,000  లబ్ధి అందుతుందన్నారు.