VIDEO: పట్ట పగలు వెలుగుతున్న వీధి దీపాలు
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని NH-365 వెంబడి ఉన్న హైమాస్ లైట్లు పట్టపగలే వెలుగుతూ విద్యుత్ వృథా అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరంతరం లైట్లు వెలుగుతుండటంతో విద్యుత్ శాఖపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికైనా స్పందించి, సమయానికి లైట్లు ఆర్పేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.