నేడు చంద్రగ్రహణం.. పలు ఆలయాలు మూసివేత

నేడు చంద్రగ్రహణం.. పలు ఆలయాలు మూసివేత

SKLM: జిల్లాలో ప్రముఖ ఆలయాలు అయినా అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీ ముఖలింగేశ్వర స్వామి, శ్రీకూర్మం, నీలమణి దుర్గమ్మ ఆలయాలను సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మ. 2 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈవోలు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అనంతరం దర్శనం కల్పిస్తామని అన్నారు. భక్తులు గమనించాలని కోరారు.