నేడు తణుకులో విద్యుత్ సరఫరా నిలిపివేత

W.G: తణుకుతో పాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కే.నరసింహమూర్తి తెలిపారు. తణుకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, ఇరగవరం మండలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అత్తిలి మండలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.