VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు తీవ్ర గాయాలు

GNTR: మంగళగిరి జాతీయ రహదారి రత్నాలచెరువు సమీపంలో సర్వీసు రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.