పోలీస్ డ్రైవర్లకు సఫారీ యూనిఫామ్‌ల పంపిణీ

పోలీస్ డ్రైవర్లకు సఫారీ యూనిఫామ్‌ల పంపిణీ

SRPT: జిల్లా పోలీస్ శాఖలో డ్రైవర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఎస్పీ నరసింహా గురువారం సఫారీ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సేవలు అందించడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని కొనియాడారు. వాహనాలను సురక్షితంగా, మంచి కండిషన్‌లో ఉంచాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఉన్నారు.