అవకతవకలు లేకుండా నిత్యావసర సరుకులు పంపిణీ

కోనసీమ: కూటమి ప్రభుత్వం హయంలో అవకతవకలకు చోటు లేకుండా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అంచనాల మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం మారేడుబాకలో గురువారం ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. పూర్తి పారదర్శకతతో ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.