కారు ఢీకొని బాలుడు మృతి

కారు ఢీకొని బాలుడు మృతి

NTR: ఏ.కొండూరు మండలంలోని చీమలపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో దిగి వెళ్లిన సమయంలో కారు ఢీకొనడంతో బాణావతు యశ్వంత్(6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.