భారీ వర్షాలపై అప్రమత్తత: ఎమ్మెల్యే

JN: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండి, సమస్యలుంటే అధికారుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు జనగామ కలెక్టర్ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పేర్కొన్నారు.